తేది:30-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం ఇంచార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్.
ప్రజా సమస్యల పరిష్కారం కొరకై అనునిత్యం ప్రజల పక్షాన ఉండే టీఎస్ లా న్యూస్ ను సద్వినియోగం చేసుకోండి- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.
తెలంగాణ,రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మహేశ్వర పిరమిడ్ కేంద్రాన్ని సందర్శించిన టీఎస్ లా న్యూస్ బృందం , యాజమాన్యం ఎడిటర్ ప్రొప్రైటర్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ప్రజా సమస్యల పరిష్కార సాధనకై స్పిరిచువల్ సైంటిస్ట్ వి మాధవ స్వామి గారితో సప్త ఋషుల ఆశ్రమం వద్ద సమావేశమై వారి యొక్క మేధాశక్తిని ఈ యొక్క ప్రజాక్షేత్రానికి ఉపయోగపడాలని ఆకాంక్షిస్తూ స్వాగతం పలికారు అదేవిధంగా టీఎస్ లా న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంలో స్పిరిచువల్ సైంటిస్ట్ వి. మాధవస్వామి గారు మాట్లాడుతూ పిల్లలను అతి సులువైన మార్గము ద్వారా ప్రయోజకులుగా తీర్చిదిద్దావచ్చని తెలియజేస్తూ అందుకు అవకాశం ఇచ్చిన టి ఎస్ లా న్యూస్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో సప్త ఋషుల ఆశ్రమం వ్యవస్థాపకులు ఆది వరలక్ష్మి గారు, మాధవ్ గారు, టీఎస్ లా న్యూస్ మెదక్ జిల్లా ఇన్చార్జి గొల్లపల్లి సాయి గౌడ్, సదాశివపేట రిపోర్టర్ ఎస్ కృష్ణ మరియు పిరమిడ్ ధ్యానులు పాల్గొన్నారు.