తమకు ప్రభుత్వం కౌలు చెల్లించాలని కోరుతూ అమరావతి రాజధాని రైతులు వేసిన పిటిషన్ ను నేడు (సోమవారం) హైకోర్టు విచారించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా తమకు మూడు వారాల సమయం కావాలని ప్రభుత్వం తరపు లాయర్లు వాదించారు. మూడు వారాల సమయం ఎందుకని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. సోమవారం విచారణలో కౌలు రైతుల చెల్లింపులపై స్పష్టతనివ్వాలని ఆదేశించింది.