టీడీపీ చీఫ్ చంద్రబాబు డిసెంబర్ మొదటి వారం నుంచి పూర్తిస్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 1న తిరుమల శ్రీవారిని దర్శించుకుని అదేరోజు అమరావతికి వెళ్లనున్నారు. ఆ తర్వాత విజయవాడ దుర్గమ్మ, సింహాచలం అప్పన్న, శ్రీశైలం మల్లన్నను బాబు దర్శించుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక స్కిల్ కేసు అరెస్ట్ తో రాజకీయాలకు తాత్కాలికంగా దూరమైన చంద్రబాబు మళ్లీ పార్టీపై ఫోకస్ పెట్టనున్నారు.