


తేది:30-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.
రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ (SOT) పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు జింక మాంసం అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం వెలుగులోకి వచ్చింది.
వెంటనే సులేమాన్ నగర్ ప్రాంతంలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో 15 కేజీల జింక మాంసంతో పాటు రూ.3,300 నగదును స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు అతడిని స్వాధీనం చేసుకున్న మాంసం, నగదితో పాటు అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు.
ఇర్ఫాన్‌పై గతంలో ఏవైనా కేసులు ఉన్నాయా అనే కోణంలో అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ జింక మాంసం ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎంతకాలంగా ఈ అక్రమ వ్యాపారం కొనసాగుతోంది, మరెవరైనా ఇందులో భాగస్వాములున్నారా అనే అంశాలపై ఎస్ఓటీ, అత్తాపూర్ పోలీసులు సంయుక్తంగా విచారణ కొనసాగిస్తున్నారు.