తేది:30-12-2025భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ధనుర్మాసం సందర్భంగా శుక్ల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతినెల గ్రామదేవతలకు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భాగంగా పంచామృతాలతో పాటు కాళేశ్వర త్రివేణి సంగమ జలాభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు నిర్వహించారు.