తేది:30-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం 2026 రాబోయే నూతన సంవత్సరం సందర్భంగా మండల వ్యాప్తంగా ఎవరైనా డీజే సౌండ్స్ పెట్టినా మద్యం తాగి వాహనాలు నడిపినా వారి పై చట్టరీత్యా చర్యలు తప్పవని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ తెలిపారు. మంగళవారం గణపురం మండల పరిధిలోని డిజె సౌండ్ సిస్టం నిర్వాహకులను నూతన సంవత్సర సందర్భంగా డీజే సౌండ్ సిస్టం ను పెట్టకుండా ఉండేందుకు స్థానిక తహసీల్దార్ ముందు ఆరు నెలలకు రూ. లక్ష పూచికత్తుతో బైండోవర్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా సంక్రాంతి సందర్భంగా ఎవరైనా చైనా మాంజ ఉపయోగించినా విక్రయించినా షాపు యజమానుల పై చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలంతా నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.