తేది:30-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం సిఐ కరుణాకర్ రావు ను మంగళవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధిలో తమకు సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. పాలనపరమైన విషయాలలో తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా సిఐ కరుణాకర్ సర్పంచ్ దంపతులకు హామీ ఇచ్చారు.