తేది:30-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన చిలువేరు కుమార్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి సర్పంచ్ కొడారి హైమావతి ధనుంజయ యాదవ్ ఆధ్వర్యంలో రూ.5 వేలు, గ్రామస్థుల రూ.12 వేలు మొత్తం 17 వేలను వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు సర్పంచ్ దంపతులకు కుమార్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దంసాని శ్రీకాంత్, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇడబోయిన సంతోష్ యాదవ్, తొట్ల రాజ గొల్ల యాదవ్, శ్రీ పెళ్లి రమణాచారి లు పాల్గొన్నారు.