

తేది:30-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం
PROPRIETOR & EDITOR కోవూరి సత్యనారాయణ గౌడ్.
తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీ జే ఎస్ ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కమిటీ ఎన్నికలు ఈ రోజు అనగా మంగళవారం 2025 డిసెంబర్ 30న జగిత్యాల, హైదర్పల్లి DLR ఫంక్షన్ హాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో, విజయవంతంగా నిర్వహించినట్లు టీ జే ఎస్ ఎస్ జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడుగా రాచమల్ల సుభాష్. ఉపాధ్యక్షలుగా దారుకోట శేఖర్, ఎడమల మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఆర్ .రాజేందర్, సంయుక్త కార్యదర్శులుగా ముదాం శ్రీనివాస్ ,గిద్దె తిరుపతి, సిగిరి రాజరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా జంగా శ్రీనివాస్ , కార్యవర్గ సభ్యులుగా లింగా వెంకటేశ్వర్ రెడ్డి, కాసిరెడ్డి నాగరాజు, ఏనుగుల లక్ష్మినారాయణ, రాడే శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వార్తల ద్వారా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం అని,జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాటుపడుతాం అని గెలుపొందిన తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీ జే ఎస్ ఎస్) జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గం తెలిపారు.