తేది:29- 12- 2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.
హైదరాబాద్, మియాపూర్ జే.పి నగర్ : నూతనంగా ఏర్పాటుచేసిన ఉజ్వా జెనరిక్ మెడిసిన్ స్టోర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధులుగా ప్రముఖ సినిమా హీరో, జెనివిస్ రెమెడీస్ బ్రాండ్ అంబాసిడర్ సుమన్, నేషనల్ హెడ్ జెనివిస్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ రాష్ట్ర అధిపతి మహేష్ సిల్వేరి లతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సీతా వైద్యం కిషోర్. అనంతరం, జ్యోతి ప్రజ్వలన గావించి ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముఖ్యఅతిథులను గౌరవప్రదంగా శాలువాలతో సన్మానించారు.