తేదీ: 29-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు.
సంగారెడ్డి జిల్లా, అమీన్పూర్: అమీన్పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అమీన్పూర్ GHMC డిప్యూటీ కమిషనర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సమావేశంలో స్థానిక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పరస్పర సహకారం అవసరమని నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో పరిపాలనతో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్‌తో పాటు రమేష్ యాదవ్, మన్నే రవీందర్, మున్న, మహేష్ గౌడ్, మహేష్, విజయ్, కృష్ణ గౌడ్, మల్లేష్, ఈశ్వర్ రెడ్డి, కృష్ణ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ గౌడ్, ప్రకాష్, ఆశన్నగరి, లక్ష్మణ, వెంకట్, ఆదిత్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.