తేది:29-12-2025 TSLANEWS జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మకపేట, యామాపూర్, తిమ్మాపూర్, మేడిపల్లి గ్రామాల్లో పలు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి హుండీల్లోని నగదును అపహరించిన నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ వరుస దొంగతనాల కేసుల్లో బొల్లవేణి మహేష్ …మైఖేల్ (29), తండ్రి రాజం, కులం ముదిరాజ్, సాయిరాం కాలనీ, మెట్పల్లి నివాసిగా గుర్తించారు. మూడు దేవాలయ దొంగతనాల కేసులకు సంబంధించి 27-10-2025న ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ ఆధ్వర్యంలో నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. అనంతరం కేసులపై విచారణ పూర్తిచేసిన జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్ 29-12-2025న తీర్పు ప్రకటిస్తూ నిందితుడికి నాలుగు నెలల జైలు శిక్షతో పాటు రూ.400 జరిమానా విధించారు. నిందితుడి అరెస్టులో చురుకుగా వ్యవహరించిన ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్‌ను, సాక్షులను కోర్టు ముందు హాజరు పరచిన ఇబ్రహీంపట్నం కోర్ట్ కానిస్టేబుల్ చక్రపాణిని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్, మెట్పల్లి డీఎస్పీ ఏ రాములు, మెట్పల్లి సీఐ అనిల్ కుమార్ అభినందించారు.