తేది:29-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు మండల ప్రత్యేక అధికారులు, టాస్క్ ఫోర్స్ టీములు, డివిజన్ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచే యూరియా అమ్మకాలు ప్రారంభించాలని సూచించారు. ప్రతి స్టాక్ పాయింట్ వద్ద ప్రారంభ, ముగింపు నిల్వలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి విక్రయ కేంద్రం వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.జిల్లాలో సహకార శాఖల ద్వారా సరిపడా కేంద్రాలున్నాయని, అదనంగా కావాల్సిన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
ప్రస్తుతం జిల్లాలో ఏఆర్‌ఎస్‌కే, డీసీఎంఎస్, ప్యాక్స్, రిటైలర్ల కేంద్రాలలో యూరియా విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు.
రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టంచేశారు.
యూరియా పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఏదేని సమాచారం కొరకు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.