అరకు వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్: సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ వేసిన రైల్వేశాఖ.. పూర్తి షెడ్యూల్ ఇదే!

విశాఖపట్నం – అరకు స్పెషల్ ట్రైన్ (08525/08526) పర్యాటకుల రద్దీని తగ్గించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే 30.12.2025 నుండి 18.01.2026 వరకు ప్రతిరోజూ ప్రత్యేక రైలును నడపనుంది.

  • వైజాగ్‌లో బయలుదేరే సమయం: ప్రతిరోజూ ఉదయం 8:40 గంటలకు.

  • అరకు చేరుకునే సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు.

  • స్టాపేజ్‌లు: సింహాచలం (08:55), కొత్తవలస (09:10), శృంగవరపుకోట (09:35), బొర్రా గుహలు (11:10).

  • తిరుగు ప్రయాణం (08526): అరకులో మధ్యాహ్నం 2:00 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది.

రైలులోని సౌకర్యాలు ఈ స్పెషల్ ట్రైన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ తరగతుల బోగీలను ఏర్పాటు చేశారు. ఇందులో ఒక 2AC బోగీ, ఒక 3AC బోగీ, 10 స్లీపర్ క్లాస్ బోగీలు, 3 జనరల్ బోగీలు మరియు ఒక జనరల్ కమ్ లగేజ్ బోగీ అందుబాటులో ఉంటాయి. పర్యాటకులు ఈ అదనపు రైలు సదుపాయాన్ని వినియోగించుకుని తమ ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

టూరిస్టులతో అరకు హౌస్ ఫుల్ ప్రస్తుతం దట్టమైన పొగమంచు మరియు చల్లని వాతావరణం కారణంగా అరకులో పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. హోటళ్లు, రిసార్టులు అన్నీ ఇప్పటికే హౌస్ ఫుల్ అయిపోయాయి. ఘాట్ రోడ్లలో వాహనాల రద్దీ పెరగడంతో పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. కాబట్టి పర్యాటకులు అరకు వెళ్లేముందే రూమ్ కన్ఫర్మ్ చేసుకుని, పక్కా ప్లానింగ్‌తో వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో బస దొరకక ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *