కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.

తేదీ:29-12- 2025 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి.

మెదక్ జిల్లా: అల్లాదుర్గం మండలం లో ఆయా గ్రామాల 45 మంది లబ్ధిదారులకు తాసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం వట్టిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మి శేషారెడ్డి తాసిల్దార్ మల్లయ్య కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు బలరాం, మండల ప్రధాన కార్యదర్శి బాలకిషన్, సర్పంచులు శ్రీనివాస్ రెడ్డి, శశిధర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, సౌమ్య సురేష్ గౌడ్, రేణుక సిద్దు, వీరప్ప, మచ్చేందర్, శంకర్ నాయక్, కవిత, జ్యోతి, రమ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *