తేదీ:29-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా :గణపురం మండలంలోని పరశురాంపల్లి గ్రామాభివృద్ధికి సహకరించాలని సోమవారం ఆ గ్రామ సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాంబయ్య యాదవ్ గ్రామ సమస్యలను జిఎం దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి నిర్వాసిత గ్రామమైన పరుశురాం పల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సహకరించాలని జిఎం కు విజ్ఞప్తి చేశారు.