తేదీ:29-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి.ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా:ఆరూర్ డిసెంబర్ 30, రోజున అనగా రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్త మహాశయులందరికి శ్రీ వెంకటేశ్వర కాలభైరవ దేవాలయ కమిటీ ఆహ్వానం పలుకుతూ వైకుంఠ ఏకాదశి
నెలకు రెండు ఏకాదసులు చప్పున ఒక సంవత్సరానికి 24 ఏకాదసులు వుంటాయి అని, ఏకాదశి తిథి మోక్ష సాధనకు,సత్వ గుణానికి అనువైనదని అయితే పుష్య శుద్ధ ఏకాదశి వీటన్నిటిలో కి చాలా ప్రత్యేకమైనది
సృష్టి ఆరంభం లో శ్రీ మహా విష్ణువు చెవిలో ఉండే వ్యర్థ పదార్థం నుండి మధు – కైటభ అను ఇద్దరు రాక్షసులు ఉద్భవించి బ్రహ్మగారి వద్ద వేదం అపహరించగా,బ్రహ్మ తనను కాపాడమని విష్ణువుని ఆశ్రయిస్తాడని విష్ణువు వెళ్లి మదుకైటభులను వారించగా, వారు తీవ్ర గర్వంతో,విష్ణువు నే వరం కోరుకోమనగా,విష్ణువు వారి ప్రాణాలు అడుగుతాడని వారు విష్ణువును వారితో మల్లయుద్ధము చేసి చంపమని షరతు పెడతారని వారి కోరిక మేరకు విష్ణువు వారిని మల్ల యుద్ధంలో ఓడించి, ఏ పుణ్యము,మోక్ష సాధన లేకపోయినా వైకుంఠం అనుగ్రహించ తలచి,వారిని ఉత్తర ద్వారం గుండా వైకుంఠం లోనికి నెడతాడని వెంటనే వారికి సత్వ గుణం, మోక్ష సిద్ధి కలిగి,వారి రూపాలు సాక్షాత్ విష్ణు స్వరూపాలు గా మారిపోతాయి అని అది చూసి వారు విష్ణువును ఒక వరం అడుగుతారని, సంవత్సరంలో 23 ఏకాదసుల లో మోక్ష సాధన చేయకపోయినా,పాప పుణ్యాలు ,మోక్ష సాధన,కర్మలతో సంబంధం లేకుండా,వారికి వైకుంఠం ప్రాప్తించిన రోజు అయిన,సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండగా,పుష్య శుద్ధ ఏకాదశి నాడు,తమ లాగే విష్ణుమూర్తిని ఉత్తర ద్వారం గుండా ఎవరైతే దర్సిస్తారో వారికి వైకుంఠం అనుగ్రహించమని అడుగుతారు అని,అందుకనే ఆరోజు మూడు కోట్ల దేవతలు కూడా స్వామి వారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారని,
మధుకైటభ వృత్తాంతం,విష్ణుపురాణం,
ఇట్టి వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా దర్శనం దర్శించి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క కృపకు పాత్రులు కాగలరని భక్త మహాశయులందరికీ పేరుపేరునా విజ్ఞప్తి చేయుచున్నారు.