తేదీ:29-12-2025 సంగారెడ్డి జిల్లాTSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి.ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: జెడ్ పి హెచ్ ఎస్ ఆత్మకూరు పాఠశాలలో విద్యార్థులకు చెవి, ముక్కు, గొంతు మరియు కంటికి కి సంబంధించిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది . డాక్టర్ అరుణ మరియు వారి వైద్య బృందంచే ముక్కు చెవి ,గొంతు, మరియు కళ్ళు అవయవాల పట్ల విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి లోపాలున్న విద్యార్థులకు కంటి అద్దాలు కూడా అందిస్తామని డాక్టర్లు చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, పాఠశాల సిబ్బంది పాఠశాల విద్యార్థులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ గ్రామ సర్పంచ్ వడ్ల నిఖిత బింబాదర్ చారి ఆత్మకూర్ గ్రామ మార్కెట్ కమిటీ డైరెక్టర్ యూసఫ్ , వార్డ్ మెంబర్ అనంతయ్య , కాంగ్రెస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు బింబాదర్ చారి మాట్లాడుతూ విద్యార్థులు కన్ను, చెవి , గొంతు మరియు కళ్ళు అవయవాల పట్ల శుభ్రంగా ఉండి ఆరోగ్యంగా ఉండాలని సూచించడం జరిగింది. జడ్.పి.హెచ్.ఎస్ ఆత్మకూర్ విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించినందుకు డాక్టర్ బృందానికి పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సందీప్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.