సింగూర్ నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి,నీళ్లు లేక పంటల భవితవ్యం అంధకారం – క్రాప్ హాలిడే ప్రకటించాలి-పద్మ దేవేందర్ రెడ్డి.

తేదీ:29-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

సింగూర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సింగూర్ ప్రాజెక్టు నీటి విడుదలపై స్పష్టమైన నిర్ణయం లేకపోవడంతో రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారని పేర్కొన్నారు.
వర్షాలు సరైన స్థాయిలో లేకపోవడం, ప్రాజెక్టు నీటి విడుదలపై అనిశ్చితి కొనసాగడంతో రైతులు పంటలు వేసుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని పట్టించుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు.
నీటి విడుదలపై వెంటనే స్పష్టత ఇవ్వాలని, ఒకవేళ పంటలకు నీరు అందించలేని పరిస్థితి ఉంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.
కార్యక్రమానికి మాజీ మెదక్ మున్సిపల్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణా రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఎం. అంజ గౌడ్, మాజీ ఎంపీపీలు కొట్టపల్లి కిష్టయ్య, దుర్గయ్య, మాజీ రైతు బంధు జిల్లా అధ్యక్షుడు సోములు, మాజీ కౌన్సిలర్లు విశ్వం, మాయ, మల్లేశం, చంద్రకళ, సోహెల్ హాజరయ్యారు.
అలాగే పట్టణ కో-కన్వీనర్లు కృష్ణ గౌడ్, లింగారెడ్డి, సర్పంచులు శంభశివరావు, మాకల సాయిలు, మాజీ పాపన్నపేట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి తో పాటు మెదక్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట మండలాల నుండి పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *