సంగారెడ్డి జిల్లాలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు,మంగళవారం జరిగే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తుల కోసం ముస్తాబుతో పాటు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలోని అందోలు మండలం కిచ్చన్న పల్లి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్తర తిరుపతి తర్వాత తెలంగాణలో రెండవ తిరుపతిగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి.

తేది:29-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్సీ సిహెచ్ సత్యనారాయణ.

సంగారెడ్డి జిల్లా: అందోల్ మండలం పరిధిలోని కిచ్చన్నపల్లి గ్రామంలో కొలువై ఉన్న పురాతన ఆలయాలకు ముక్కోటి ఏకాదశి నాడు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతిగా పేరుగాంచిన చరిత్ర ఈ ఆలయానికి ఉందన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఇక్కడి వైష్ణవ ఆలయాలలో ఉత్తర ద్వారం (వైకుంఠ ద్వారం) ద్వారా భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ఉత్తర ద్వారం గుండా స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి హరినామ స్మరణతో జాగరణ చేయడం వల్ల అపరిమితమైన పుణ్యఫలం లభిస్తుందని ఆలయ పూజారి లక్ష్మణ చర్య అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *