మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేలంగి నరసింహ రావు ఫిల్మ్ డైరెక్టర్ గారి చేతుల మీదుగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాలెండర్-2026 ఆవిష్కరణ.

తేదీ:29-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ బి.విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్,కూకట్పల్లి:మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాలెండర్ -2026 ను ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ లైఫ్ సీనియర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ , హ్యూమన్ రైట్స్ & కన్స్యూమర్ రైట్స్ ఉమెన్స్ వింగ్ ప్రతినిధి శ్రీమతి దుర్గ భవాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ అనేది విలాసం కాదు అవసరమని, అనుకోని ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థిక భద్రత కల్పించడంలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి విశ్వసనీయ సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. అలాగే మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎంతో అవసరమని పేర్కొన్నారు.
అదేవిధంగా, మానవ హక్కులు మరియు వినియోగదారుల హక్కులపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని దుర్గ భవాని అన్నారు.
ఈ కార్యక్రమంలో మనమ్ ఫౌండేషన్ ప్రతినిధులు, ఇంగోలిన్ టెక్ సిస్టమ్స్ యాజమాన్యం, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మరియు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *