తేదీ:29-12-2025 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని.
హైదరాబాద్,ఎల్.బి.నగర్: గ్లోబల్ హెల్త్ టూరిజం రంగంలో ప్రముఖ సంస్థ అయిన మిట్టా ఎక్సలెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మిట్టా ఎక్సలెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మిట్టా శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్,మహిళా సాధికారత-మానవ హక్కుల పరిరక్షకురాలు శ్రీమతి డా. పారువెల్లి అంక విజయ దుర్గ భవాని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె ని మిట్టా ఎక్సలెన్స్ సంస్థ ఎమ్.డి శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. అలాగే ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాలెండర్-2026 ను ఆయన చేతుల మీదుగా అధికారికంగా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఇన్సూరెన్స్ ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే ముఖ్యమైన సాధనమని, అనుకోని ప్రమాదాలు, ఆరోగ్య సమస్యల సమయంలో ఇన్సూరెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అలాగే ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందించడంలో మిట్టా ఎక్సలెన్స్ సంస్థ అందిస్తున్న టెలీమెడిసిన్, డయాగ్నొస్టిక్స్, డాక్టర్ కన్సల్టేషన్, ఫిజియోథెరపీ, డెంటల్ కేర్ వంటి సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.మిట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా సంస్థ ముందుకు సాగుతోందని, భవిష్యత్తులో హెల్త్ సిటీ, మిట్టా హెల్త్ కార్డ్స్ వంటి కార్యక్రమాల ద్వారా మరింత విస్తృత సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఆమె చేస్తున్న సేవలను అభినందిస్తూ భవిష్యత్తు లో మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన ఆశీర్వదించారు.