కిసారా రాంలింగేశ్వర స్వామి మందిరం వద్ద ఘనంగా మున్నూరు కాపు సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారము.

తేది:28-12-2025 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా TSLAWNEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గము ఇంచార్జ్ మల్లికార్జున్ బెస్త.

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా:మున్నూరు కాపు సంఘం కొత్త జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం కిసారా రాంలింగేశ్వర స్వామి మందిరం వద్ద ఘనంగా జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పూటంపూరశోత్తం విచ్చేశారు.
ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శి చాట్లపల్లి నర్సింగరావు, ఉపాధ్యక్షులు తూము పెద్ద శ్రేవాన్ కుమార్, కార్యదర్శి భాషెట్టి నర్సింగరావు, కార్యనిర్వాహక కార్యదర్శి గున్నాల వినోద్ కుమార్, కోశాధికారి, ఉపాధ్యక్షలు, కార్యదర్శులు, కార్యనిర్వాహక, సంయుక్త కార్యదర్శులు తదితర జిల్లా కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతల ప్రమాణ స్వీకారం చేశారు.
కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎంజలా పద్మయ్య, తిరుపతి మరియు మూసాపేట్ అధ్యక్షులు తూము నర్సింగరావు పటేల్, ప్రధాన కార్యదర్శి జిల్లా జీతరావు, జిల్లా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం మున్నూరు కాపు సంఘం సభ్యుల సమన్వయం, కృషి, మరియు స్థానిక నాయకత్వ బలోపేతానికి ప్రతీకగా నిలిచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *