అంగరంగ వైభవంగా గ్రామ నగర సంకీర్తన.

తేది:28-12-2025 మెదక్ జిల్లా TSLAW NEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి.పాపయ్యచారి.

మెదక్ జిల్లా: పుష్య ధనుర్మాసాలను పురస్కరించుకొని ఆదివారం అల్లాదుర్గంలో నిర్వహించిన గ్రామ సంకీర్తన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆరోగ్య, భాస్కర పేరుతో గ్రామంలోని దేవాలయాల లో మొట్ట మొదటిసారిగా గ్రామ దేవతల సందర్శనతో పాటు ఆయా దేవాలయాలలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ అర్చకులు శీలం కోట ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా, భక్తిశ్రద్ధలతో, భజనలు, కీర్తనలతో స్థానికంగా ఉన్న ప్రముఖ దేవాలయాలు వెంకటేశ్వర స్వామి, వీరభద్ర, రేణుక ఎల్లమ్మ, కేశనాథ స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, హనుమాన్, శివాలయలు, పోలేరమ్మ, దుర్గమ్మ ,పోచమ్మ, కట్ట మైసమ్మ, సంగమేశ్వర దేవాలయాలు తో పాటు ఆయా దేవాలయాల్లో వందలాది మంది భక్తులు సంకీర్తన సందర్శనలో భాగంగా ఆలయాలలో కొబ్బరికాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రమైన అల్లాదుర్గంలో గ్రామ ప్రజలు ఒకేరోజు 57 దేవాలయాలను సందర్శించి తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంచరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *