
తేది:28-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి.పాపయ్య చారి.
మెదక్ జిల్లా: గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో జాతిపిత మహాత్మా గాంధీ పేరును ప్రవేశపెట్టింది. నేడు కేంద్ర ప్రభుత్వం తొలగించడం విరమించుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేషారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి స్వతంత్రాన్ని సాధించి పెట్టిన జాతిపిత మహాత్మా గాంధీ పేరును తొలగించడం బిజెపి ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ ఆశయ సాధనలో భాగంగా పేద ప్రజల ఉపాధి కోసం ప్రవేశపెట్టిన ఎన్ఆర్ఇజిఎస్ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టి జాతిపితను కాంగ్రెస్ పార్టీ గౌరవించిందని, కానీ నేడు కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీపై అక్రోషంతో గాంధీ పేరుని తొలగించి అవమాన పరుస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ పథకం పేరును యధావిధిగా మహాత్మ గాంధీ పేరుతోనే కొనసాగించాలని, లేనియెడల దేశవ్యాప్తంగా నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేసి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుభాష్ రావు , ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాం, ప్రధాన కార్యదర్శి బాల కిషన్ ,వివిధ గ్రామాల సర్పంచులు, శశిధర్ రెడ్డి, మాన్య నాయక్, హరికృష్ణ, నాయకులు శేఖర్, చెన్నప్ప, చంద్రశేఖర్, , కిరణ్, శ్రీశైలం ,సిద్ధూ, బేతయ్య, బాల్రాజ్, శ్రీనివాస్, విట్టల్, కేశా నాయక్ సాయిబాబా ,జైపాల్, ఆంజనేయులు ,నాగరాజు, మదర్, కృష్ణ, హన్మే నాయక్ తదితరులు పాల్గొన్నారు.