తేదీ:28-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా, మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా:మెదక్ పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. పార్టీ 141వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో రాందాస్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ ,
“పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశ చరిత్రలో 141 సంవత్సరాలు పార్టీ నిలబడగలిగింది అంటే అది ప్రజల విశ్వాసమే,” అన్నారు.
బీజేపీ, బిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రజలకు అన్యాయం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. జాతీయ ఉపాధి పథకం పేరును మార్చే ప్రయత్నం ద్వారా బీజేపీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని మండిపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రం, రాష్ట్రం రెండింట్లోనూ ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వస్తుందని ఆంజనేయులు గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంత్ రావు, పీసీసీ సభ్యులు సుప్రభాత్ రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ తోడుపునూరి చంద్రపాల్, ప్రభాకర్ రెడ్డి, చౌదరి శ్రీనివాస్ రావు, మధుసూదన్ రావు, పరుశరామ్ గౌడ్ తదితర సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.