తెల్లాపూర్ మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్.

తేది:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.

సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో గల భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతరలో పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. స్వామి వారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.దేవాలయాలు ఆధ్యాత్మిక నిలయాలని.. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు.అనంతరం కురుమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఘనంగా సన్మానించారు.హాజరైన తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ లలితా సోమిరెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ అంజయ్య, రాగం దేవేందర్ యాదవ్, మల్లారెడ్డి, బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు, కురుమ సంఘం నాయకులు,భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *