
తేదీ:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.
సంగారెడ్డి జిల్లా: పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ మండలం పటేల్ గూడా గ్రామ పరిధిలో ఉన్న సుజనా లక్ష్మీ కాలనీలో ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ హాజరై ప్రధాని నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ ప్రసంగాన్ని కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన్ కీ బాత్ ద్వారా ప్రధాని దేశ ప్రజలను ఐక్యత, దేశభక్తి, సామాజిక బాధ్యత వైపు ప్రేరేపిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించారు. అనంతరం దేశాభివృద్ధి, స్వచ్ఛ భారత్, మహిళా సాధికారత, యువత పాత్ర వంటి అంశాలపై చర్చలు నిర్వహించారు.
స్థానికంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో జాతీయ భావన మరింత బలపడుతుందని నాయకులు అభిప్రాయపడ్డారు.