తేదీ:28-12-2025సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.
సంగారెడ్డి జిల్లా: కార్మిక సంఘ నాయకుడిగా కార్మికుల పక్షాన నిరంతరం పోరాడిన వ్యక్తి పీజేఆర్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాల్ పరిధిలోని చిట్కుల్ జీటీఎన్ టెక్స్టైల్స్ ఆవరణలోనీ ఆయన విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు, పరిశ్రమ కార్మికులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా సీఎల్పీ నాయకుడిగా పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని అంతే కాకుండా కార్మికుల తరఫున పోరాడే వ్యక్తిగా కార్మికుల గుండెల్లో నిలిచిపోయారన్నారు, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటూ ప్రజాప్రతినిధిగా ఎన్నో సేవలు అందించారని ఆయన గుర్తుచేశారు. అలాంటి మహనీయుడిని మార్గదర్శకంగా తీసుకుని ముందుకు సాగాలని, ఎంతోమంది వస్తుంటారు కానీ గుర్తుండేవారు కొంతమందే అని అలాంటి వ్యక్తుల్లో పీజేఆర్ ఒకరిని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో జీటీఎన్ పరిశ్రమకు చెందిన అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ సుంకరి రవీందర్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ నారాయణ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు వెంకటేష్, అజ్జు, ముత్తంగి అశోక్,గోపాల్, గౌరీ శంకర్, అనిల్ కుమార్, కరణ్, సుంకరి యాదయ్య, జీటీఎన్ కార్మికులు,కార్మిక సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు,పీజేఆర్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.