
తేది:28-12-2025 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం హన్మకొండకి చెందిన శ్రీనివాస కిడ్నీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్.రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కిడ్నీ సంబంధ వ్యాధులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్నగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.పాలకుర్తి ప్రజలు ఉచిత వైద్య శిబిరం అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి కి వారి వైద్యబృందానికి ధన్యవాదాలు తెలుపుతూ అభినందించారు. డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఈ శిబిరంలో కిడ్నీరాళ్లు, కిడ్నీఇన్ఫెక్షన్, మూత్రములో మంట, మూత్రంలో రక్తంరావడం, మూత్రం సరిగా రాకపోవడం, మూత్రం ఎక్కువసార్లు రావడం, స్త్రీలలో తుమ్మితే దగ్గితే మూత్రం పడిపోవడం, మగవాళ్లలో శిగ్రాస్కాలనం, సెక్స్ సంబంధ సమస్యలు సంతానలేమి వంటి ప్రజల సమస్యలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి మందులను అందించామని తెలిపారు.ఈ శిబిరం లో సూపర్ 400 మంది హాజరైనారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గాదెపాక కిరణ్, వార్డు సభ్యులు వీరమనేని హన్మంతరావు, సలెంద్ర రమ సోమన్న, ఎలుమకంటి స్వప్న సతీష్, కత్తి దస్తగిరి, కమ్మగాని సుధాకర్, మామిండ్ల కవిత శోభన్ బాబు, దాసరి అనూష, మధు, జలగం మమత నరేష్, బీఆర్ఎస్ నాయకులు కమ్మగాని నాగన్నగౌడ్,కడుదుల కరుణాకర్ రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గూడూరు లెనిన్, మామిండ్ల సోమన్న (ఎం.ఎస్),గజ్జి సంతోష్ కుమార్, తాడూరు రమేష్, తదితరులు పాల్గొన్నారు.