సోమనాథుడు ఆరాధ్యుడు-ప్రొ.శివరాజ్ పాటిల్.

తేది:28-12-2025, జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.

తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడు బసవేశ్వర అనుయాయులకు ఆరాధ్యుడు అన్నారు బీదర్ విశ్వవిద్యాలయం కన్నడ శాఖ సహాయ ఆచార్య శివరాజ్ పాటిల్. ఆదివారం ఆయన జనగామ జిల్లా పాలకుర్తి పర్యటనకు వచ్చారు. స్వయంభూ సోమేశ్వర స్వామికి అభిషేకం చేసిన అనంతరం పాల్కురికి సోమనాథుని స్మృతి వనం సందర్శించారు. సోమనాథుడు బసవపురాణం వ్రాసిన తరువాతనే బసవేశ్వరుని సమగ్ర చరిత్ర ప్రపంచానికి తెలిసింది అన్నారు. బసవన్నతో పాటు శివశరణులు అందరి చరిత్రను అందులో కూర్చిన ఘనత కూడా సోమనాథునిదే అని అభిప్రాయ పడ్డారు. భవిష్యత్తులో పాల్కురికి సోమనాథుని స్మృతి వనం గొప్ప పర్యాటక కేంద్రంగా మారగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ శివారాజ్ పాటిల్ వెంట సోమనాథ కళా పీఠం అధ్యక్షుడు డాక్టర్ రాపోలు సత్యనారాయణ, అడుగు దినపత్రిక చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ, దేవస్థాన అర్చకులు, సిబ్బంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *