తేదీ:28-12-2025 సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్.
సంగారెడ్డి జిల్లా: ముత్తంగి డివిజన్ పరిధిలోని పోచారం గ్రామ పరిధిలో గల శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆదివారం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.జనవరి 5, 6 తేదీలలో జాతర సందర్భంగా స్వామివారి కల్యాణం, అగ్నిగుండాలు, బండ్ల ఊరేగింపు,బోనాలు,తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కోడూరి బిక్షపతి, తలారి బిక్షపతి, రాజు, కిష్టయ్య, శ్రీశైలం గౌడ్, గ్రామస్తులు పాల్గొన్నారు.