ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం – జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.

 

తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

జగిత్యాల జిల్లా : ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.ఈ రోజు ఆదివారం టీచర్స్ భవన్ లో పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనందరావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పి ఆర్ టి యు టి ఎస్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి కూడా వారే కాబట్టి ముఖ్యమంత్రి వారి విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది కాబట్టి ప్రభుత్వ పాఠశాల స్థితిగతులు ఉపాధ్యాయుల సమస్యలు వారికి అవగాహన ఉందని అదేవిధంగా ఉపాధ్యాయుల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ సంఘాల నాయకులతోని టీచర్ ఎమ్మెల్సీ ల తోని మాట్లాడుతున్నారని అదేవిధంగా త్వరలోనే హెల్త్ కార్డులు ఉద్యోగ ఉపాధ్యాయులకు మంజూరు కాబోతున్నాయని వారన్నారు ఉపాధ్యాయ సంఘాల్లో పెద్ద సంఘమైన పి ఆర్ టి యు టి ఎస్ ఉపాధ్యాయ సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతుందని అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ఉపాధ్యాయ సమస్యలపై ఎప్పుడు రాష్ట్ర విద్యాశాఖ అధికారులతో సంప్రదిస్తున్నారని వారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 20,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు లభించాయని వారన్నారు అదేవిధంగా టెట్ సమస్యకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని వారన్నారు సరస్వతి శిశు మందిర్ వాణి సహకార జూనియర్ కళాశాల వ్యవస్థాపకులు కాసుగంటి సుధాకర్ రావు జగిత్యాల ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేశారని గోదావరి వాల్యూ స్థాపించి రైతులకు వ్యవసాయ పనిముట్లు తయారుచేసివి రైతులకు అందజేసి వ్యవసాయ అభివృద్ధికి ఎంతో తోడుపడ్డారని వారి తాత జగిత్యాల్ ఎస్ కె న్ ఆర్ డిగ్రీ కళాశాలకు భూమి ప్రధానం చేసి ఎంతోమంది జగిత్యాల ప్రాంత ప్రజల విద్యాభివృద్ధికి తోడ్పడ్డారని వారన్నారు వారి తాత జగిత్యాల్ నుండి శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఆనంద్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం పైలెట్ గా మండలనికి ఒక పాఠశాలలో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రవేశపెట్టబోతుందని అన్నారు ప్రతి విద్య సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ బదిలీలు పదోన్నతులు జరిపించాలని వాటి వలన జీరో స్కూల్స్ బెడద తప్పుతుందని వారన్నారు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు చాలా కాలం బిల్లులు పెండింగ్లో ఉన్నాయని పిఆర్సి డిఏ పెండింగ్ లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వారి కోరారు అనంతరం 2026 టేబుల్ మరియు వాల్ కేలండర్లను శాసనసభ్యులు ఆవిష్కరించారు ఈ మాసంలో పదవి విరమణ పొందుతున్న ఉపాధ్యాయులను సన్మానించారు కాసుగంటి సుధాకర్ రావు మృతికి సంతాపంగా ఉపాధ్యాయులు రెండు నిమిషాలు మౌనం పాటించారు 300 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఉపాధ్యాయ సంఘం మాస పత్రిక సభ్యులు అబ్దుల్ జమీల్, ఏవియన్ రాజు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు, జమున తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *