కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. పదేళ్లు నేను పడిన కష్టం వృథా అవుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో 12 మంది సీఎంలు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.2 వేలకు పెంచామని చెప్పారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పింఛన్ రూ.5 వేలకు పెంచుతామని తెలిపారు.