రాష్ట్ర జర్నలిస్టు సంఘాల జేఏసీ కన్వీనర్ గా TJSS రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు – అభినందనలు తెలిపిన జగిత్యాల జిల్లా TJSS ఇన్చార్జి సంజయ్ రెడ్డి.

తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ రాచమల్ల సుభాష్.

హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంఘాల జేఏసీ ఏర్పాటు చేశారు. జర్నలిస్టు సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా అనంచిన్ని వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు (TJSS) తో పాటు మామిడి సోమయ్య, కే.కోటేశ్వర్ రావు, పులిపలుపుల ఆనందం, రావికంటి శ్రీనివాస్, మమతా రెడ్డి, బైసా సంగీత నియామకం అయ్యారు, జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం (TJSS) ఇన్చార్జి సంజయ్ రెడ్డి అభినందనలు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రసార సాధనాలలో పనిచేసే వారందరికీ అక్రెడిటేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, ఉచిత విద్య, వైద్యంతో పాటు జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్, 60 ఏళ్ళు పై బడిన వారందరికీ పెన్షన్ పథకం, ఉచిత బస్ ప్రయాణం ఏర్పాటు చేయాలని, సుమారు 40 వేల మంది జర్నలిస్టులతో ‘మహా జాతర’ నిర్వహించాలని, ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానిస్తాం అని, సభ ఘనంగా నిర్వహిచాలని తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తీర్మానం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 48 సంఘాలు పాల్గొన్నాయి.
ఈ కార్యక్రమంలో అనంచిన్ని వెంకటేశ్వరరావు,తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు (TJSS), పాశం యాదగిరి, మామిడి సోమయ్య,పులిపలుపుల ఆనందం, కె.కరుణాకర్, వెంకటరత్నం, కోలా శ్రీనివాస్,కన్నూరి రాజు, పడాల వంశీ, ఖమ్మంపాటి సాయి చందర్ గౌడ్, ఆర్. శ్రీనివాస్ గౌడ్, కందుకూరి యాదగిరి, బి.రమేష్ కుమార్, ఎం. శ్రావణ్ కుమార్, బందేల రాజశేఖర్, కొండా శ్రీనివాస్, తన్నీరు శ్రీనివాస్, ఏఐడబ్ల్యూజెఎ ప్రతినిధులు సిహెచ్.వెంకటేశ్వర్లు, పురుషోత్తం, రాజు నరసింహ, డివిఐన్. ప్రసాద్, టిజేఎస్ఎస్ ప్రతినిధులు ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, సంయుక్త కార్యదర్శి కీర్తి సంతోష్ రాజ్, బాపట్ల కృష్ణమోహన్, మహిళా కోఆర్డినేషన్ మమతారెడ్డి, భాగ్యనగర్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యం గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రాజనర్సింహ, సి.హెచ్.శ్రీధర్, ఎం.పురుషోత్తం, డా.కే.అంజిరెడ్డి, పి.సుధాకర్ గౌడ్, వి.నరేష్, పి.అశోక్ గౌడ్, నీలం బాలరాజ్, కే.రవీందర్ గౌడ్, సత్యం రాంపల్లి, వెంకట యోగి రఘురాం, మహేష్ కుమార్, సంతోష్ కుమార్, బి.ఎన్.చారి, రాజు, రియాజ్, ఎం.డి.కరీం,సవల్కేర్ శ్రీధర్, మెడిశెట్టి వెంకటేశ్వర్, ఎస్.శ్రీనివాస్ రావు, ప్రమోద్ కుమార్, జె.బాలకృష్ణ, నరేష్ బుచ్చి రెడ్డి, ఎస్.శివప్రసాద్ గౌడ్,లక్వుద్దీన్, శోభన్ బాబు, వేణుగోపాల్ , ఆర్.వి.ఎల్.ఎన్.ప్రసాద్, దారం జగన్నాథం రెడ్డి, అశోక్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నంబి పర్వతాలు, సి.హెచ్.శ్రీనివాస్, రావికంటి శ్రీనివాస్, కె.బాపురావు, వివిధ జిల్లాల ప్రతినిధులు, తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.
జర్నలిస్టు సంఘాల జేఏసీ ఏర్పాటు సభ్యులు
కన్వీనర్లుగా మామిడి సోమయ్య, కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, పులిపలుపుల ఆనందం, రావికంటి శ్రీనివాస్, మమతా రెడ్డి, బైసా సంగీత.
కో-కన్వీనర్లుగా శ్రీనివాస్, చింతల శ్రీనివాస్, కందుకూరి యాదగిరి, సత్యం గౌడ్, లాయఖుద్దీన్, పురుషోత్తం , చింతకాయల వెంకటేశ్వర్లు, రాజనర్సింహ, డి.ఎల.ప్రసాద్ లతో పాటు పలువురు కో- ఆర్డినేటర్లతో జాయింట్ యాక్షన్ కమిటీ ఈ సందర్భంగా ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *