
తేది:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం వార్డ్ నెంబర్ 2 కోఆర్డినేటర్ కోవూరి కృష్ణ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఈరోజు జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నందు విద్యార్థులకు మోటివేషన్ స్పీకర్ పరమాత్మ గారు ప్రేరణాత్మక తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకోవాలని లక్ష్యసాధనను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని సాధిస్తూ మన అనుకున్న పెద్ద లక్ష్యాన్ని సాధించాలని కోరారు
విద్యార్థులు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉండడం వలన వారికి లక్ష్య సాధన సులభం అవుతుందని విద్యార్థులు ప్రతిరోజు యోగ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కస్పాండెంట్ రఘు వర్ధన్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రీతి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.