

తేదీ:27-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ .
మెదక్ జిల్లా : ఈరోజు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ హాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ శ్రీ k. ఇలంబర్తి ఐఏఎస్ గారు హాజరై సంబంధిత శాఖ అధికారులతో విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఐఏఎస్ గారు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్ గారు సమావేశంలో పాల్గొని రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలకు ప్రధాన కారణాలు, వాటి నివారణకు చేపట్టాల్సిన కార్యాచరణపై సూచనలు చేశారు.
ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ట్రాఫిక్ నియంత్రణ, అవగాహన కార్యక్రమాలు, నిబంధనల కఠిన అమలు, హైవేలు మరియు ప్రమాదకర ప్రాంతాల్లో తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.