లక్ష్మీపూర్లో కళ్ళల్లో కారం చల్లి అర్ధరాత్రి కిరాతకంగా చంపిన ఘటన – దాడి చేసిన వారిపై కేసు నమోదు – దర్యాప్తు ప్రారంభించిన జగిత్యాల రూరల్ పోలీసులు.

తేది:27-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా, లక్ష్మీపూర్ రిపోర్టర్ మల్లారెడ్డి.

పెద్దపెల్లి జిల్లా, తురకలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్, తండ్రి పేరు బుర్ర శంకర్ ,వయస్సు 33 సంవత్సరాలు అను అతడిని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గర్వాంద సంధ్య, జగిత్యాలకు చెందిన భైరవేణి సమత, వారికి సంబంధించిన మరికొంతమందితో కలిసి లక్ష్మీపూర్ గ్రామంలో గర్వంద సంధ్య ఇంటికి దగ్గరలో గల రోడ్డుపై నిన్న శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో బుర్ర మహేందర్ పై బలమైన ఆయుధాలతో తలపై దాడి చేసి చంపారని మృతుడి తండ్రి బుర్ర శంకర్ ఫిర్యాదు మేరకు జగిత్యాల రూరల్ పోలీసు వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *