తేది:26-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం ధర్మారావు పేట అదనపు గోదాం కు యూరియా వచ్చి రెండు రోజులైనప్పటికీ రైతులకు యూరియా పంపిణీ చేయక వ్యవసాయ అధికారులు రైతులకు ఎటువంటి సమాచారం ఇప్పటివరకు ఇవ్వకుండా వర్షాకాలం లాగానే ఈ వేసంగి కూడా యూరియా బస్తాలు రైతులకు సరైన సమయానికి అందివ్వక అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఆదర్శ రైతు ఆకుల సుభాష్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు ఒక రైతుగా నానా ఇబ్బందులు పడుతూ పంట సరిగా లేక దిగుబడి రాక కనీసం పెట్టుబడి లేక రైతు తెచ్చుకున్న అప్పు తీర్చే పరిస్థితిలో లేడు కనీసం ఇప్పటికైనా రైతులకు ఎరువు బస్తాల కొరత లేకుండా చూడాలని అటు అధికారులను ఇటు నాయకులను కోరారు గతంలో 2009లో ఇటువంటి ఎరువుల కొరత ఏర్పడ్డ సందర్బంలో ప్రతి రైతుకు ఒక పాస్ బుక్ ఏర్పాటు చేసి వ్యవసాయ అధికారులు అప్పుడు ఆదర్శ రైతులుగా మేము రైతుకు ఇవ్వడం జరిగింది ఈ పాస్ బుక్ వల్ల ఏ రైతు ఎన్ని సార్లు ఎరువులు తీసుకున్నారని ఒక లెక్క ఉంటుంది అని తెలిపారు.