తేదీ: 26-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల.
భూపాలపల్లి జిల్లా:గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు నుంచి నీటిని దిగువకు యాసంగి పంటల సాగుకు నీటిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా యాసంగి పంట సాగు చేసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. గణపసముద్రం చెరువు నీటిని విడుదల చేయడం ద్వారా ఆయకట్టు పరిధిలోని పొలాలకు సరిపడా నీరు అందుతుందన్నారు. నియోజకవర్గంలోని చివరి ఆయకట్టు రైతులకూ సమాన ప్రాధాన్యత ఇస్తూ సాగునీటి సరఫరా కొనసాగుతుందని, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల నిర్వహణపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నీటి వృథా జరగకుండా పర్యవేక్షణ పెంచినట్లు పేర్కొన్నారు. రైతులే ప్రభుత్వానికి కేంద్రబిందువని, వారి సంక్షేమమే లక్ష్యంగా సాగునీటి సమస్యలు తలెత్తకుండా తక్షణ చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు వారివెంట అధికారులు వివిధ గ్రామాల సర్పంచ్ లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.