తేదీ:26-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్.
వరంగల్ జిల్లా: భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) స్థాపనకు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్లో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భవ్యమైన మహా ప్రదర్శన నిర్వహించారు. ఎర్ర జెండాలు, బ్యానర్లతో, కార్మికులు,విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని జై కారాలు నినదించారు.సిపిఐ నేతలు మాట్లాడుతూ, దేశ ప్రజాస్వామ్య రక్షణ, కార్మిక–రైతు హక్కుల కోసం శతాబ్ద కాలంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అలుపెరగక పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. కార్పొరేట్ విధానాలు, పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, రైతుల కష్టాలపై ప్రజా ఉద్యమాలను మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా నిర్వహించిన ఎర్ర జెండాల ర్యాలీ నగరంలోని ముఖ్య రహదారుల వరంగల్ రైల్వే స్టేషన్, పోస్ట్ ఆఫీస్ గుండా సాగి ఆకర్షణీయంగా మారింది. నినాదాలతో మారుమోగిన ర్యాలీలో పార్టీ జెండాలతో యువత, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం విశేషం.