తేదీ 26-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: డిసెంబర్ 25న తొర్రూరు పట్టణంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతోత్సవం సందర్భంగా “అక్షర సేద్యం ” సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కస్తూరి పులేందర్ అధ్యక్షతన జాతీయ తెలుగు సాహిత్య వేదిక సౌజన్యంతో “అజాతశత్రువుకు అక్షర నీరాజనం ” జాతీయ తెలుగు కవితోత్సవం నిర్వహించారు. ఈ కవిత ఉత్సవాల్లో పాల్గొనేందుకు రావలసిందిగా నిర్వాహకులు పోతన సాహిత్య కళావేదిక ప్రతినిధులకు ఆహ్వానం పంపగా, పోతన సాహిత్య కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యపు భుజేందర్, కార్యదర్శి దేవసాని ఉపేందర్, సలహాదారుడు అంకాల సోమయ్య లు పాల్గొని తమ కవితా గానాలను ఆలపించారు. వీరికి ముఖ్య అతిథులచే సన్మానం సత్కారం చేశారు. ఈ సాహిత్య కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మసన చెన్నప్ప పూర్వాధ్యక్షులు తెలుగు శాఖ, ప్రముఖ కవి సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, జాతీయ సాహిత్య పరిషత్ ప్రాంత కార్యదర్శి ఎమ్మెస్ ఎన్ మూర్తి, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు తక్కల్లపల్లి రవీందర్ రావు , బండి రాజుల శంకర్, కుందూరు రాజేందర్ రెడ్డి, గడ్డం రాజు, బుధరపు శ్రీనివాస్, సామల కిరణ్, మార్గం సతీష్, గుర్రపు సత్యనారాయణ, ఇమ్మడి రాంబాబు, చీదెళ్ళ సీతామహాలక్ష్మి, కస్తూరి సంధ్య, నాల్లం శ్రీనివాస్,కవులు కళాకారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.