
తేది:26-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా: శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల, శ్రీ వాణి సహకార జూనియర్ కళాశాల, గోదావరి వ్యాలీ అధినేత, భారతీయ నాగరికత విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు గురువారం రాత్రి హైదరాబాదులో అస్తమించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ తో పాటు శ్రీ వాణి సహకార జూనియర్ కళాశాల, గోదావరి వ్యాలీ ఇండస్ట్రీస్ స్థాపించి ఎంతో మందిని
ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఆపన్న హస్తం. అంతేకాకుండా సమాజ సేవలో ముందుండి రోటరీ క్లబ్ ద్వారా ఎన్నో సేవలు అందించారు. ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించడమే కాకుండా ఎన్నో సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో తన వంతుగా సహాయ సహకారాలు అందజేశారు. విద్యావేత్తగానే కాకుండా సామాజిక సేవా భావంతో స్వచ్ఛందంగా సేవలందించారు.వారి సేవలు,సంస్థల ద్వారా వందలాదిమంది ఉపాధి పొందుతున్నారు,పొందుతూనే ఉన్నారు,ఇది కాసుగంటి సుధాకర్ రావు మానవతా దృక్పథం.
భాదాతప్త హృదయాలతో జగిత్యాల జిల్లా ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు.తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ , మంచాల కృష్ణ, టీ వి సూర్యం, భారతీయ నాగరిక విద్యాసమితి అధ్యాపక బృందం తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.