తేది:25-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం.
మెదక్ జిల్లా: మెదక్‌లోని ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చ్ అయిన సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం భారతి సిమెంట్ ఆధ్వర్యంలో ఉచిత పాల వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
క్రిస్మస్ వేడుకల సందర్భంగా తెల్లవారుజామునే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చర్చికి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని భారతి సిమెంట్ సంస్థ ఆధ్వర్యంలో, రామలింగేశ్వర ట్రేడర్స్ సహకారంతో, ప్రొప్రైటర్ లింగమూర్తి సౌజన్యంతో చర్చ్ ప్రాంగణంలో ఉచితంగా పాల పంపిణీ చేపట్టారు.
ఈ సందర్భంగా భారతి సిమెంట్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) పి. కొండల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత 14 సంవత్సరాలుగా క్రిస్మస్ సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులు వేకువజామునే చర్చికి చేరుకోవడంతో ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు పాల వితరణ కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ఇది ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు.
క్రిస్మస్ రోజున సంగారెడ్డి జిల్లాతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో కూడా ఇదే తరహా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మొదటి ఆరాధన అనంతరం రెవరెండ్ శాంతయ్య భారతి సిమెంట్ కేక్‌ను కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారతి సిమెంట్ నిర్వాహకులు భక్తులకు “మెరీ క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్” అంటూ శుభాకాంక్షలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పి. కొండల్ రెడ్డి (అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ – మార్కెటింగ్), నాగేశ్వరరావు (బ్రాంచ్ హెడ్), గంగాధర్ రెడ్డి (డిప్యూటీ మేనేజర్), సునీల్, మెదక్ మార్కెటింగ్ సునీల్ రెడ్డి తదితర భారతి సిమెంట్ సిబ్బంది పాల్గొన్నారు.