
తేది:25-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం
PROPRIETOR &EDITOR కోవూరి సత్యనారాయణ గౌడ్.
తెలంగాణ:తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా కమిటీల నియామకం చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. వార్తల ద్వారా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేసే జర్నలిస్టులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాటుపడే వారు జిల్లా కమిటీల ద్వారా మీ సేవలు అందించే అవకాశం ఉంది.
తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా కమిటీల నియామకానికి ఈ నెల 28 చివరి తేదిగా ప్రకటించారు.
కావున అసక్తి గల జర్నలిస్టులు ఈ నెల 28 ఆదివారం లోపు జగిత్యాల జిల్లా ఇంచార్జి సంజయ్ రెడ్డిని, 7386863999 వాట్సాప్ ద్వారా సంప్రదించగలరని రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.