సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు జరుపుకున్న- చర్చి పాస్టర్లు, క్రిస్టియన్ సోదరీ, సోదరీమణులు.

తేది:25-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అందోల్ నియోజకవర్గం కోఆర్డినేటర్సి హెచ్.సత్యనారాయణ.

సంగారెడ్డి జిల్లా: అందోలు నియోజకవర్గంలో క్రైస్తవ సోదరులు పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయా చర్చిలలో పాస్టర్లు క్రిస్టియన్ సోదర సోదరీమణులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
శాంతి, ప్రేమలను ప్రపంచానికి బోధించిన ఆ కరుణామయుడి గురించి పలువురు పాస్టర్లు మాట్లాడుతూ లోక రక్షకుడు కరుణామయుడు ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజున జరుపుకునే క్రిస్మస్ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో చర్చ్ పాస్టర్లు, నాయుకులు, క్రిస్టియన్ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *