

తేది:25-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.
మెదక్ జిల్లా: ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ అయిన మెదక్ క్యాథడ్రల్‌లో నేడు 101వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యయి.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రైస్తవ భక్తులు, అలాగే పరిసర జిల్లాలు, గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున వేడుకలకు హాజరయ్యారు.
ప్రభు యేసుక్రీస్తు జన్మదినాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు, కీర్తనల గానం, క్రిస్మస్ సందేశాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మెదక్ క్యాథడ్రల్ చర్చ్‌ను విద్యుత్ దీపాలు, నక్షత్రాలు, క్రిస్మస్ అలంకరణలతో సుందరంగా ముస్తాబు చేయగా, రాత్రివేళ ఈ చర్చ్ మరింత ఆకర్షణీయంగా కనిపించింది.
దేశవ్యాప్తంగా భక్తుల భారీ రాకను దృష్టిలో ఉంచుకుని మెదక్ జిల్లా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. చర్చ్ పరిసర ప్రాంతాలు, ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి, ట్రాఫిక్ నియంత్రణ, జనసమూహాల నిర్వహణ చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెంచారు.
వేడుకలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో సాగగా, క్రిస్మస్ సందేశమైన శాంతి, ప్రేమ, సోదరభావం దేశమంతటినీ ఏకతాటిపై నిలిపినట్లు కనిపించింది. చర్చ్ అధికారులు, స్వచ్ఛంద సేవకులు, పోలీస్ శాఖ సమన్వయంతో ఈ మహోత్సవం విజయవంతంగా ప్రారంభమయ్యింధి