తేదీ 25-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: పాలకుర్తి లోని వల్మీడి క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా రెండు లారీలు వాటి నంబర్ల AP 16 TY 1688 మరియు AP 28TA 7432 ల లో అనుమానాస్పదంగా బియ్యం రవాణా చేస్తుండగా పట్టుకుని సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కు అప్పగించి అవి పీడీఎస్ రైస్ అవునో కాదో తెలుసుకునగా అవి ప్రభుత్వం సరఫరా చేసే పీడీఎస్ రైస్ అని నిర్ధారణ కావడం తో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ ఫిర్యాదు మేరకు సదరు లారీ జార్ఖండ్ కు చెందిన డ్రైవర్ లపై మరియు ఐతే కృష్ణ, ఐతే శ్రీకాంత్ హైదరాబాద్ కు చెందిన వ్యక్తుల పై కేసు నమోదు చేసి బుధవారం రోజు డ్రైవర్లను రిమాండ్ కు పంపించడం జరిగింది . పరారీ లో ఉన్న ఐతే కృష్ణ, ఐతే శ్రీకాంత్ లు ఖమ్మం జిల్లా మధిర నుండి మహారాష్ట్రకు బియ్యం తరలిస్తున్నారని తెలిసినది పట్టుకున్న మొత్తం పీడీఎస్ బియ్యం 370 క్వింటాళ్ళు వాటి విలువ సుమారు సుమారు 16 లక్షలు ఉంటుంది. త్వరలోనే పరారీలో ఉన్న నిందితులను పట్టుకుంటామని తెలిపారు.