తేదీ 25-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker.
జనగామ జిల్లా: కేంద్ర ప్రభుత్వం మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి నూతనంగా తీసుకువచ్చిన విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కార్యదర్శి మాచర్ల సారయ్య డిమాండ్ చేశారు.
బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఏజెండాను అమలు చేయడంలో భాగంగా ఉపాధి హామీ చట్టాన్ని కోట్లాదిమంది ప్రజల ఉపాధిని కాలరాసిందన్నారు.కూలీలకు చెల్లించే నిధులు ఎవరు చెల్లించాలని స్పష్టత లేదన్నారు జాబ్ కార్డులు రెగ్యులేషన్ పేరుతో ఇప్పటికే కోట్లాదిమంది ఉపాధి కూలీల తొలగింపు ప్రక్రియ ప్రారంభించింది అన్నారు. వి బి జి రాంజీ అనే సాధారణ పథకాన్ని తీసుకురావడానికి ప్రజలు వ్యతిరేకించాలని కోరారు.గత 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ చట్టం ద్వారా గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు పేద ప్రజలకు లబ్ధి చేకూర్చిందన్నారు.జీవన ప్రమాణాలకు మెరుగుకు ఉపయోగపడిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గమైందని విమర్శించారు.ఏడాదికి 100 రోజుల పని దినాలు కల్పించాలని నూతన పథకంలో 120 రోజులకు పొడిగించామని మభ్యపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆర్థిక లోటుతో రాష్ట్రాలు ఉపాధి హామీ పథకానికి నిధులు చెల్లించకుంటే ఉపాధి పనులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పెద్దలపై ఉన్న ప్రేమ పేద ప్రజలపై లేదన్నారు.ఇప్పటికైనా వి బీ జీ రామ్‌జీని తక్షణమే రద్దు చేయాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.