
తేది 23-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash.
మెదక్ జిల్లా : మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారికి సీనియర్ ఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ గారు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పదోన్నతి సాధించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు గారికి జిల్లా పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేస్తూ, ఆయన నాయకత్వంలో పోలీస్ శాఖ మరింత సమర్థవంతంగా సేవలందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.